- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Collector :సీజనల్ వ్యాధులతో జాగ్రత్త
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: వర్షాలు కురుస్తున్నందున పట్టణంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫివర్ లాంటి సీజనల్ వ్యాధులు ప్రభలుతున్నాయని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. జిల్లా కేంద్రంలోని శేషాద్రీనగర్ లోని ఒక కుటుంబంలో డెంగ్యూ వ్యాధి నమోదైనదనే సమాచారంతో గురువారం ఆమె సంబంధిత ఇంటిని, పరిసరాలను పరిశీలించారు. అనంతరం శుభ్రత,స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. ప్రధానంగా నీటి నిల్వ, కాల్వల శుభ్రత, చెత్త, చెదారం లాంటివి లేకుండా చూసుకోవాలన్నారు. దగ్గు, జలుబు, జ్వరం లాంటి అనారోగ్య సమస్యలొస్తే ప్రారంభదశలో చికిత్సకోసం వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని ఆమె సూచించారు. కలెక్టర్ వెంబడి మున్సిపల్ చైర్మెన్ ఆనంద్ గౌడ్,జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు,కౌన్సిలర్లు తిరుమల వెంకటేష్,ప్రశాంత్,ఆర్పీ లు,అంగన్వాడీ ఆయాలు,తదితర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.