- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షాద్ నగర్‌లో ఘనంగా CMR షాపింగ్ మాల్ ప్రారంభం
దిశ, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద వస్త్ర వ్యాపార సంస్థ CMR షాపింగ్ మాల్ షాద్ నగర్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ షాపింగ్ మాల్‌ను టీడీపీ సీనియర్ నేత బక్కని నర్సింహులు చేతుల మీదుగా షాద్ నగర్ విజయ డెయిరీ ఎదురుగా ప్రారంభమైంది. ల్యాండ్ లార్డ్ పలబట్ల బాలరాజు మొదటిగా వస్త్రాలు కొనుగోలు చేశారు.
ఈ సందర్భంగా CMR ఫౌండర్ & చైర్మన్ మావూరి వెంకటరమణ మాట్లాడుతూ ప్రపంచ స్థాయి వస్త్ర సౌరభం షాద్‌నగర్‌లో లభిస్తుందని చెప్పారు. అన్నిరకాల వేడుకలకు కుటుంబమంతటికీ నచ్చే విధంగా అతి తక్కువ ధరలకే వస్త్రాలు అందించటం CMR ప్రత్యేకత అని తెలిపారు. సొంతంగా మగ్గాలపై నేయించిన వస్త్రాలను మార్కెట్‌లో మరెవ్వరూ ఇవ్వని ధరలకు CMR అందిస్తుందన్నారు.
CMR మేనేజింగ్ డైరెక్టర్ మావూరి మోహన్ బాలాజీ మాట్లాడుతూ తమ సంస్థకు చెందిన 27వ షోరూంను షాద్‌నగర్‌లో ప్రారంభించటం చాలా ఆనందంగా ఉందన్నారు. CMR అంటే ది వన్ స్టాప్ షాప్ అని, ది వన్ స్టాప్ షాప్ అంటే ఫ్యామిలీ అందరికీ నచ్చే విధంగా అన్ని రకాల స్టైల్స్, డిజైన్స్ లభిస్తాయన్నారు, తమ వద్ద అన్ని వర్గాలకు అందుబాటు ధరలలో లభించే విధంగా లక్షల్లో డిజైన్లు, వేలల్లో వెరైటీలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
CMR షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో సినీతార అనసూయ భరద్వాజ్ సందడి చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జ్యోతిప్రజ్వలన చేసి అన్ని సెక్షన్లు తిరుగుతూ షోరూంలో ఉన్న అన్నిరకాల డిజైన్లు పరిశీలించారు. 40 సంవత్సరాలుగా వస్త్ర వ్యాపార రంగంలో క్వాలిటీకి, డిజైన్‌కు CMR ప్రత్యేకతనిస్తూ తెలుగు రాష్ట్రాల్లో అగ్రగామిగా నిలిచిందన్నారు. సీఎంఆర్ అంటే కుటుంబసభ్యులు మెచ్చే కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ అని అనసూయ కొనియాడారు.