Sunil Gavaskar : అర్ధగంటలో 445 పరుగులు చేయలేరు.. : సునీల్ గవాస్కర్

by Sathputhe Rajesh |
Sunil Gavaskar : అర్ధగంటలో 445 పరుగులు చేయలేరు.. : సునీల్ గవాస్కర్
X

దిశ, స్పోర్ట్స్ : అర్ధగంటలో 445 పరుగులు కొట్టలేరని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నాడు. బ్రిస్బేన్ టెస్ట్‌ మూడో రోజు భారత బ్యాట్స్‌మెన్ల ప్రదర్శనపై ఆయన చురకలు అంటించారు. ‘జైస్వాల్ ఎలా వికెట్ ఎలా చేజార్చుకున్నాడో చూడండి. మీ ముందు కఠినమైన సవాల్ ఉన్నప్పుడు ఓపికగా అలాంటి షాట్లు ఆడకుండా ఉండాలి. కేవలం అర్ధగంటలో 445 పరుగులు ఎవరూ చేయలేరు. ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కాలంటే 245 పరుగులు అవసరం. ఔట్ సైడ్ ఆఫ్ బంతులను గిల్, విరాట్ కోహ్లీ వెంటాడి ఔట్ అయ్యారు. పిచ్ పాత్ర ఏమీ లేదు. పూర్ షార్ట్‌ల కారణంగానే వికెట్లు చేజార్చుకున్నారు.’ అని సునీల్ గవాస్కర్ అన్నాడు. అయితే మూడో టెస్ట్‌లో భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ల తడబాటు కారణంగా టీంఇండియా మళ్లీ చిక్కుల్లో పడింది. కేవలం 17 ఓవర్లు ఆడి 51/4 మాత్రమే చేసింది. జైస్వాల్, గిల్, కోహ్లీ, పంత్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.

Advertisement

Next Story

Most Viewed