BRS leaders : రాబోయే రెండు, మూడు మాసాలలోనే బై ఎలక్షన్..

by Sumithra |
BRS leaders : రాబోయే రెండు, మూడు మాసాలలోనే బై ఎలక్షన్..
X

దిశ, బిజినేపల్లి : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏమీ ఒరగబెట్టింది లేదని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బై కాని శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మాజీ మార్కెట్ చైర్మన్ గంగనముని కిరణ్ స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లి మళ్లీ యూటర్న్ గా బీఆర్ఎస్ పార్టీలోకి చేరడం హర్షించదగ్గ విషయమని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరు నచ్చక ఎమ్మెల్యే పై ఎన్నో ఇబ్బందులకు గురి చేయించి పార్టీలో చేర్పించుకున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అన్నారు. ఇంకా ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలిపారు. రాబోయే రెండు, మూడు మాసాలలోనే తెలంగాణ రాష్ట్రంలో బై ఎలక్షన్ రాబోతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2024 వరకే ముగిస్తుందని అన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందిన ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్ పార్టీ విడవక కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనసాగాలని చూశారు.

కానీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని పలుమార్లు సభలలో ప్రకటనలు చేశారు. ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరినీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నాడు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దేనితో కొట్టాలో చెప్పగలరని ఆయన సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలిచినప్పటి నుంచి కాంట్రాక్టర్లు ఎక్కడ పనులు నిర్వహించిన కాంట్రాక్టర్ల నుంచి వారికి పది శాతం కమిషన్ ఇవ్వాలని బెదిరిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క నోటిఫికేషన్ వేసిన దాఖలాలు లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టి మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని ఆయన ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలోనే 30,000 ఉద్యోగాలు వేసి పరీక్షలు రాస్తే ఇప్పుడు జాబులు వస్తే మేమే వేశామని సంకలు గుద్దుకోవడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబడే డిసెంబర్ లోనే రుణమాఫీ పూర్తిస్థాయిలో చేస్తామని చెప్పి ఇప్పుడు రైతులకు లేనిపోని షరతులు విధించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.

అనంతరం మాజీ మార్కెట్ చైర్మన్ గంగనమోని కిరణ్ మాట్లాడుతూ ఇంతవరకు ఏ ఒక్క రైతుకు భరోసా ఇచ్చిన దాఖలాలు లేదని అన్నారు. ఎన్నికల ముందు గెలిచిన వెంబడే వృద్ధులకు వితంతువులకు, వికలాంగులకు పెన్షన్లు పెంచుతామని చెప్పి ఇంతవరకు పెంచిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. మా కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో ఉన్నారని అతి తక్కువ సమయంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కరెంట్ కష్టాలు తప్పడం లేదని ప్రజలు రైతులు లబోదిబోమంటున్నారని అన్నారు. ప్రజలందరూ సీఎం కేసీఆర్ని మళ్లీ కోరుకుంటున్నారని త్వరలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె నెక్కనుందని అన్నారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ మండల నాయకులు గోవిందు నాగరాజు, రాము నాయక్ ,బొల్లం శివ, జహంగీర్, సిద్దుల శివ తో పాటు పలువురు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed