- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సొసైటీ రైతులందరికీ రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ నాయకుల ధర్నా
దిశ, పెంట్లవెల్లి: పెంట్లవెల్లి మండల కేంద్రంలోని సొసైటీ రైతులందరికీ రుణమాఫీ చేయాలని సోమవారం బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి పెంట్లవెల్లి కొత్త బస్టాండ్ సమీపంలోని రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. అంతకుముందు రైతులతో ఆరు నెలలకు ఒకసారి నిర్వహించే మహా జనసభ నిర్వహించారు. రైతులకు ఎందుకు రుణమాఫీ కావడం లేదని చైర్మన్‌ను ఆరా తీశారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ విజయ రామారావు మాట్లాడుతూ.. రైతులందరికీ రుణమాఫీ చేయాలని హైదరాబాద్‌కు వెళ్లి కమిషనర్ వినోద్ కుమార్ కలిసి వినతిపత్రం అందజేశామని.. పెంట్లవెల్లి సొసైటీలో 499 మంది రైతులు ఉన్నారని ఒక్క రైతుకు కూడా కాలేదని వారు ఆరోపించారు. తక్షణమే ముఖ్యమంత్రి, మంత్రి జూపల్లి స్పందించి పెంట్లవెల్లి సొసైటీలో రుణమాఫీ పూర్తి చేయాలని వారిని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ పోతుల వెంకటేష్, సీనియర్ నాయకులు సురేందర్ గౌడ్, జ్ఞానేశ్వర్, రైతులు తదితరులు పాల్గొన్నారు,