జేఆర్వో లుగా ప్రమోషన్ కల్పించండి: తెలంగాణ రికార్డు అసిస్టెంట్స్ అసోషియేషన్

by Mahesh |
జేఆర్వో లుగా ప్రమోషన్ కల్పించండి: తెలంగాణ రికార్డు అసిస్టెంట్స్ అసోషియేషన్
X

దిశ, ఖైరతాబాద్: ఇంటర్ విద్యార్హత కలిగిన వారికి జేఆర్వోలుగా పదోన్నతి కల్పించాలని తెలంగాణ రికార్డు అసిస్టెంట్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. ప్రెస్ క్లబ్‌లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో సంఘం అధ్యక్షుడు దాసరి వీరన్న ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి లక్ష్మళ్ల నరసింహ మౌర్య మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో పదో తరగతి అర్హతతో రెవెన్యూ శాఖలో వీఆర్ఏలు గా పనిచేస్తున్న తమకు వీఆర్వో గా పదోన్నతి కల్పించారన్నారు. ప్రస్తుతం రెవెన్యూ వ్యవస్థను పటిష్ట పరిచే దిశలో కాంగ్రెస్ ప్రభుత్వం పరీక్ష ద్వారా అవకాశం కొత్తవారికి అవకాశం కల్పిస్తామని, డిగ్రీ ఉన్న వారు పరీక్షలు రాసుకోవచ్చని ప్రకటన ఇచ్చిందన్నారు. ఈ వ్యవస్థలో పదేళ్లు అనుభవం ఉన్న తమకు జేఆర్వోగా అవకాశం కల్పించాలన్నారు. గత ప్రభుత్వం ప్రమోషన్లో భాగంగా జోనల్ వ్యవస్థకు విరుద్దంగా దూర ప్రాంతాలకు బదిలీ చేశారని, వారందరినీ సొంత జిల్లాలకు బదిలీ చేయాలని కోరారు. 2014 నుంచి నేటి వరకు చనిపోయిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలివ్వాలని ఈ సందర్భంగా వారు రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed