మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే నాణ్యమైన మందు

by srinivas |
మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే నాణ్యమైన మందు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మద్యం ప్రియులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది. కొత్త మద్యం పాలసీలో భాగంగా రూ. 99కే నాణ్యమైన మందు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి కొల్లు రవీంద్ర కీలక ప్రకటన చేశారు. దసరాకు ముందు నుంచే కొత్త వైన్ షాపులు అందుబాటులోకి వస్తున్నట్లు తెలిపారు. మద్యం షాపులకు దరఖాస్తులు ఆహ్వానించామని, వారం పాటు స్వీకరిస్తామని చెప్పారు. పదో రోజు దరఖాస్తులను డ్రా తీస్తామన్నారు. ఒక్కో దరఖాస్తు ఫీజు రూ. 2 లక్షలని తెలిపారు. ఎవరు ఎన్ని షాపులకైనా ఎన్ని దరఖాస్తులైనా వేసుకోవచ్చని మంత్రి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు.

కాగా గత ఐదేళ్ల పాటు మద్యం షాపులను ప్రభుత్వం నడిపింది. ఇష్టమొచ్చిన కొత్త మద్యం బ్రాండ్లను అమ్మకాలు చేసింది. అంతేకాదు ధరలు సైతం విపరీతంగా పెంచి విక్రయాలు జరిపింది. అయితే మద్యం అమ్మకాల్లో భారీగా అవకతవకలు జరిగాయని ప్రస్తుత ప్రభుత్వం భావించింది. దీంతో మద్యం షాపులను రద్దు చేసింది. రిటైల్ అమ్మకాలు జరపాలని, ధరలను అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ఈ మేరకు అడుగులు వేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed