- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజావాణి దరఖాస్తులను త్వరిత గతిన పరిష్కరించాలి.. కలెక్టర్
దిశ, మేడ్చల్ బ్యూరో : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి కోరారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో 63 ఫిర్యాదులను అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, రెవెన్యూ అధికారి జెఎల్ బి.హరిప్రియలు స్వీకరించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే స్పందిస్తూ వాటిని వెంట వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
వినతుల పై చేపట్టిన చర్యలను వివరిస్తూ ఆన్లైన్ పోర్టల్ లో అప్లోడ్ చేయాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని, అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు.