ప్రగతి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం : మంత్రి నిరంజన్ రెడ్డి

by Vinod kumar |
ప్రగతి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం : మంత్రి నిరంజన్ రెడ్డి
X

దిశ, వనపర్తి టౌన్: ప్రజల కోసం, ప్రగతి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో ఆయన సమక్షంలో 50 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామ గ్రామాన అభివృద్ధి.. గడప గడపకూ సంక్షేమం పథకాలు చేరేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం చేయూత నందిస్తుందన్నారు.

దేశానికి ఆదర్శంగా మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ, వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరంటు, రైతు బీమా, రైతుబంధు పథకాలను తెలంగాణ ఆచరిస్తున్నది.. దేశం అనుసరిస్తున్నదని తెలిపారు. పనిచేసే ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు ఉంటాయన్నారు. ఏదులలో రైతన్నల సంబరాలు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదములు తెలిపారు. మంత్రి సమక్షంలో కురుమ సంఘం వాసులు వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, మల్లేష్, చిన్నఊశన్న, యాదయ్య, రాము, సాయన్నతో పాటు 55 మంది కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Advertisement

Next Story

Most Viewed