- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లను శుభ్రం చేసిన బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్
దిశ, మహమ్మదాబాద్: గండీడ్ మండల కేంద్రంలో చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సోమవారం పర్యటించారు. ముందుగా గండీడ్ వ్యవసాయ సహకార సంఘం దగ్గరికి వెళ్లారు. వారిని పీఎసీఎస్ డైరెక్టర్స్, చైర్మన్ శాలువా కప్పి స్వాగతం పలికారు. రైతుల రుణమాఫీ గురించి వారితో చర్చించారు. రైతులకు తెలియకుండా రైతుల పేర్లపై రుణాలు తీసుకున్నట్లు వస్తున్న ఆరోపణలపై తెలుసుకున్నారు. అనంతరం గండీడ్, సల్కర్ పేట్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న బాత్రూంలను ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి శుభ్రం చేశారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మరుగుదొడ్లు, మూత్రశాలలు శుభ్రంగా ఉండాలని లేనియెడల రోగాల బారిన పడతారని తెలిపారు. అదేవిధంగా చెట్లను నాటారు. మహమ్మదాబాద్, గండీడ్ మండలాల్లోని 30 పాఠశాలను జస్టిస్ కొండా మాధవరెడ్డి ట్రస్టు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య వాహనం ద్వారా శుభ్ర పరుచుటకు నిర్ణయించారు. అలాగే పరిశుద్ధ వాహన యజమాని కిష్టయ్యని సన్మానించారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వెంట బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి, నాయకులు ప్రహ్లాద రావు, మిట్ట పరమేశ్వర్ రెడ్డి, ప్రభ నాయక్, వెంకటయ్య నరహరి రెడ్డి బీజేపీ కార్యకర్తలు కెఎంఆర్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.