- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోటకొండలో బైక్ ర్యాలికి మద్దతు తెలిపిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు...
దిశ, నారాయణపేట ప్రతినిధి : కోటకొండ మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కోటకొండ భగత్ సింగ్ విగ్రహం నుండి నారాయణపేట జిల్లా కేంద్రం వరకు పలువురు బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు కోటకొండ గ్రామపంచాయతీ దగ్గర 24వ రోజు రిలే నిరాహార దీక్షల్లో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నాయకులు కూర్చున్నారు. దాదాపు 500 బైక్ లతో కోటకొండ నుంచి నారాయణపేట జిల్లా కేంద్రం వరకు బైక్ ర్యాలీ కొనసాగింది.
అంబేద్కర్ చౌరస్తా బస్టాండ్ మీదుగా సెంటర్ చౌక్, బంగారు బజార్, పాత బస్టాండ్, అనంతరం తెలంగాణ చౌరస్తాకు చేరుకుని తెలంగాణ చౌరస్తాలో కుంభం శివకుమార్ రెడ్డి, సత్య యాదవ్ బైక్ ర్యాలీలో పాల్గొని మాట్లాడుతూ అన్ని రకాల అర్హతలు ఉన్న అనాధికారికంగా మండలంలో కొనసాగుతున్న కోటకొండ ను మండల కేంద్రంగా ఎందుకు ప్రకటిస్తలేరని ప్రశ్నించారు. ఎవరు ఇచ్చిన ఇవ్వకపోయినా అన్ని పోరాటాలకు అండగా , అడ్డా ఉన్న కోటకొండ, ఈరోజు మండలానికి నోచుకోకుపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కాగ కోటకొండ, అభంగపూర్ ,తిరుమలపూర్ గనిమోని బండ, నమలపల్లి, బండ గొండ, మేక హనుమాన్ తండా, ఊట కుంట తండా, దేవుని తిరుమలాపూర్, బొమ్మను పాడు తదితర గ్రామాల ప్రజలు ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.