- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్‌కు భారీ షాక్.. పార్టీకి రాజీనామా చేసిన కీలక నేతలు
దిశ బ్యూరో, మహబూబ్ నగర్: వనపర్తి జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇస్తూ జిల్లా పరిషత్ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, పెద్దమందడి ఎంపీపీ మెగా రెడ్డి, వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి తో పాటు పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు ఇతర నాయకులు రాజీనామాలు చేశారు. గత కొన్ని నెలలుగా మంత్రి నిరంజన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ వస్తున్న వర్గం గురువారం ఖిల్లా గణపురం మండలం సల్కలాపూర్ గ్రామంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశంలో తాము పార్టీకి రాజీనామాలు చేస్తున్నట్లుగా ప్రకటించారు. తమ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ముఖ్యమైన నేతలు, అధికారులు వ్యవహరిస్తున్నారని.. ఈ విషయమై అధిష్టానం దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లిన ప్రయోజనం లేకపోయిందని.. ఈ కారణంగానే పార్టీకి రాజీనామాలు చేస్తున్నట్లుగా జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, ఎంపీపీలు కిచ్చారెడ్డి, మెగా రెడ్డి మీడియాకు వెల్లడించారు.
రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఇదే విధమైన పరిస్థితులు ఉన్నాయని వారు వెల్లడించారు. పార్టీకి రాజీనామా చేసిన తాము నెలరోజుల పాటు ఆయా మండలాలలో విస్తృతంగా పర్యటించి పదవులకు రాజీనామా చేసే విషయంపై నిర్ణయాలు తీసుకుంటామని.. ప్రజాభిప్రాయం మేరకు భవిష్యత్తు రాజకీయాల కోసం ఏ పార్టీలో చేరేది త్వరలోనే వెల్లడిస్తామని వారు తెలిపారు. జిల్లా పరిషత్ చైర్మన్, ఇద్దరు ఎంపీపీలు, 11 మంది సర్పంచులు, ఆరుగురు ఉపసర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పలువురు పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పార్టీకి రాజీనామాలు సమర్పించడం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చర్చనీయంశం అయ్యింది.