మహిళల రక్షణ కోసం 'భరోసా' కేంద్రం

by Naveena |   ( Updated:2024-11-12 15:55:46.0  )
మహిళల రక్షణ కోసం భరోసా కేంద్రం
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్:మహిళలు,చిన్నారులకు రక్షణతో కూడిన భరోసాను కల్పిస్తూ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో..భరోసా సెంటర్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మెన్ చిన్నారెడ్డి అన్నారు. స్థానిక మోనప్ప గుట్ట ప్రాంతంలో మేఘా కంపెనీ వారి సౌజన్యంతో 2 కోట్ల రూపాయలతో నిర్మించిన 'భరోసా సెంటర్'ను మంగళవారం పార్లమెంటు సభ్యురాలు డికే అరుణ,ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి,జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి,జిల్లా ఎస్పీ జానకి లతో కలిసి ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. జనాభాలో సగం భాగమైన మహిళలు,చిన్నారులు మోసపోయిన,మోసగింపబడిన వారికి అండగా ఉంటూ భద్రత కల్పిస్తూ..వారి సంరక్షణ కోసం ఈభరోసా సెంటర్ బాధ్యత తీసుకుంటుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల రక్షణకై అనేక చర్యలు తీసుకుంటున్నారని,మహిళల,చిన్నారులు తమకు జరిగిన అన్యాయం,మోసంను పోలీస్ స్టేషన్ లో కానీ..ఈ భరోసా సెంటర్ లో కాని ఫిర్యాదు చేస్తే వారికి పూర్తి రక్షణ కల్పిస్తూ..న్యాయం జరుగుతుందని వైస్ చైర్మెన్ చిన్నారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో టిపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్,మార్కెట్ కమిటీ చైర్మెన్ అనిత,వైస్ చైర్మెన్ విజయ్ కుమార్,అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్,అదనపు ఎస్పీలు రాములు, సురేష్ కూమార్,డిఎస్పీలు వెంకటేశ్వర్లు,రమణారెడ్డి,శ్రీనివాసులు,సిఐలు అప్పయ్య,ఇజాజోద్దీన్,సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్ష కార్యదర్శులు జగపతిరావు,నస్కంటి నాగభూషణం,తదితర పోలీస్ అధికారులు,మహిళల రక్షణ కోసం "భరోసా" కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed