బడుగు, బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ : టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఎర్ర శేఖర్

by Sridhar Babu |
బడుగు, బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ : టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఎర్ర శేఖర్
X

దిశ, జడ్చర్ల : తెలంగాణ ఇచ్చిన, బడుగు, బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ అని, సోనియమ్మను గౌరవిద్దామని ఊరుకొండ మండలంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న హాత్ సే హాత్ జూడో యాత్రలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఎర్రశేఖర్ పిలుపునిచ్చారు. బుధవారం జడ్చర్ల నియోజకవర్గంలోని ఉరుకొండ మండలంలో హాత్ సే హాత్ జోడోయాత్రలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మండలంలో రాహుల్ సందేశ పత్రం గడపగడపకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐసీసీ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్రకు సంఘీభావంగా బుధవారం ప్రతి గడపగడపకు వారి సందేశాన్ని తీసుకెళ్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తేవడానికి ప్రతి కార్యకర్త కంకణ బదులై పార్టీకి పనిచేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ పేద, బలహీన వర్గాల ప్రజల నడ్డి విరుస్తున్నాయని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అనేక అభివృద్ధి సంక్షేమ పథకాల వల్లనే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ఉందని, అటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా తయారు చేసిన ఘనత కల్వకుంట్ల కుటుంబానికి దక్కుతుందని ఆరోపించారు.

తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబమే బాగుపడ్డది కానీ ప్రజలు కాదని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేయాలని కోరారు. ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్త ఆరు నెలలపాటు కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి తమ వంతు కృషి చేయాలని, వారికి అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో మాధారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి, కాంగ్రెస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు కంఠం విజయుడు, ఆలయం మాజీ చైర్మన్ నర్సిరెడ్డి, నాయకులు ఆయుబ్ పాషా, వహీద్, మనోహర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, అజహర్, శ్రీశైలం, షైబాజ్, ప్రవీణ్ రెడ్డి, రాజు, ఆదినారాయణ, మాసుం, షాకిర్, మధు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed