అచ్చంపేట మున్సిపల్ చైర్మన్‌గా గార్లపాటి శ్రీనివాస్ నియామకం

by Indraja |   ( Updated:2024-07-06 07:44:59.0  )
అచ్చంపేట మున్సిపల్ చైర్మన్‌గా గార్లపాటి శ్రీనివాస్ నియామకం
X

దిశ, అచ్చంపేట: అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని ఎట్టకేలకు కైవసం చేసుకుంది. శనివారం ఎన్నికల ఆర్డిఓ మాధవి, మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్ ఇతర అధికారుల ఆధ్వర్యంలో 14వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గార్లపాటి శ్రీనివాసులుకు మద్దతుగా ఎమ్మెల్యేతో పాటు 16 మంది కౌన్సిలర్లు చేతులెత్తి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఐదు మంది బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు గైర్హాజరైనారు.

ఈ సందర్భంగా చైర్మన్ పదవికి ప్రమాణ స్వీకారం చేసిన గార్లపాటి శ్రీనివాసులు, వైస్ చైర్మన్ శైలజ విష్ణువర్ధన్ రెడ్డిలను ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అభినందించారు. అయితే ఈ సందర్భంగారం కమిషనర్ శ్యాంసుందర్ మీడియాను ఆహ్వానించారు. ఆహ్వానం మేరకు అక్కడకు చేరుకున్న మీడియాను కమిషనర్ శ్యాంసుందర్ పలకరించలేదు. దీనితో తమను ఆహ్వానించి అవమానించారంటూ మీడియా ప్రతినిధులందరూ సమావేశాన్ని బహిష్కరించి వాక్ అవుట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed