కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య రసాభాస

by Sumithra |
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య రసాభాస
X

దిశ, గోపాలపేట : వనపర్తి జిల్లా గోపాలపేట మండలం పోలికపాడు గ్రామంలో సుమారుగా 200 ఓట్లను అధికార పార్టీ గల్లంతు చేశారని వాటిని మరో గ్రామానికి మళ్ళించారని ఎలక్షన్ ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో పోలింగ్ కేంద్రాల వద్ద కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య రసాభాసగా మారింది. పోలికపాడు గ్రామానికి చెందిన 200 ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి చెందినవని వాటన్నిటిని తాడిపత్రి గ్రామ ఓటర్ల జాబితాలో మళ్లించినట్లు తెలుస్తుంది. పోలికపాడు గ్రామంలో ఉండాల్సిన ఓటర్ల జాబితాలో గ్రామంలో డిలీట్ చేసి తాడపత్రి గ్రామంలోని లిస్టులో ఓటర్ల పేర్లు బయటపడ్డాయి.

దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఘర్షణ చెలరేగింది. కాంగ్రెస్ పార్టీ ఓటర్లు ఉన్నాయని కావాలనే అధికార పార్టీ వాళ్లు తమ ఓట్లను ఇక్కడ తీసివేసినట్లు కాంగ్రెస్ నాయకులు వారి పై మండిపడ్డారు. తమ విలువైన ఓటును వేయడానికి వచ్చిన ఓటర్లు వారి పేర్లు లిస్టులో లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. ఈ విషయం పై సంబంధిత ఎలక్షన్ ఈసీకి, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గం తెలిపింది.


Advertisement

Next Story

Most Viewed