బైకుపై వెళ్తూ ఆగివున్న ట్రాక్టర్ ట్రాలీని ఢీకొని వ్యక్తి మృతి..

by Kalyani |   ( Updated:2023-03-01 12:46:45.0  )
బైకుపై వెళ్తూ ఆగివున్న ట్రాక్టర్ ట్రాలీని ఢీకొని వ్యక్తి మృతి..
X

దిశ, ఊట్కూర్: బైకుపై వెళ్తున్న క్రమంలో ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రాలీని ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని తిమ్మారెడ్డిపల్లి తండా గ్రామ శివారులోని నారాయణపేట మరికల్ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధన్వాడ గ్రామానికి చెందిన సుధాకర్ బజాజ్ ఫైనాన్స్ లో కలెక్షన్ బాయ్ గా విధులు నిర్వహిస్తున్నాడు.

మంగళవారం రాత్రి తన విధులు ముగించుకొని నారాయణపేట నుంచి తిరుగు ప్రయాణంలో స్వగ్రామానికి బైకుపై వస్తుండగా తిమ్మారెడ్డి పల్లె చెరువు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రాలీని ప్రమాదవశాత్తు ఢీకొట్టాడు. దీంతో సుధాకర్ కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story