- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కూలిన ఇల్లు, మార్గమధ్యన పడిన భారీ వృక్షం.. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న అధికారులు
దిశ, ఊట్కూర్: మండలంలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మండలం చిత్తడిగా ముద్దయింది. భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరద నీరు చెరువులలోకి వస్తుంది. భారీ వర్షాలకు వాగులు వంకలు పొర్లుతున్నాయి. ఆదివారం ఉదయం ఊట్కూర్ పెద్ద చెరువు అలుగు పారింది. తెల్లవారుజామున 5 గంటలకు చిన్న పొర్ల గ్రామానికి చెందిన గుపన్ అంజి ఇల్లు కూలిపోయింది. ఇంట్లో ఉన్న టీవీ పై బియ్యం ప్యాకెట్స్ పైన మట్టి కూరుక్కపోయింది. దీంతో కుటుంబ సభ్యులను జీపీ కార్యాలయంలో ఉంచినట్లు గ్రామస్తులు తెలిపారు. అంజి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ సర్పంచ్ రవీందర్ రెడ్డి కోరారు. మరో వైపు చిన్నపొర్ల, పులి మామిడి గ్రామ మధ్య భారీ వృక్షం రహదారిపై పడింది. దీంతో ఇరు గ్రామాల రాకపోకలు ఆగిపోయాయి.
పలు గ్రామాలలో బ్రిడ్జిలు లేకపోవడంతో వాహనదారులకు అంతరాయం కలుగుతుంది. ఊట్కూర్ పెద్ద చెరువు అలుగు, చిన్న వాగు తో పాటు మండల సరిహద్దు ప్రాంతంలో ఉన్న పెద్ద వాగు సైతం ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సంఘం బండ రిజర్వాయర్ భారీగా నీరు చేరుతుంది. దీంతో నేడు 10 గేట్లు ఎత్తి దిగువకు నీరును వదిలే అవకాశం ఉంది. మండలంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని... పురాతనమైన ఇళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళు సురక్షితమైన ప్రదేశాలలో ఉండాలని, వాగులు పక్కకు పిల్లలను పంపించవద్దని ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలనీ ఎంపీడీవో ధనంజయ గౌడ్, తహసిల్దార్ రవి, ఎస్సై కృష్ణమరాజు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.