బస్సులో 36 లక్షల చోరీ...

by Kalyani |   ( Updated:2024-07-16 10:22:31.0  )
బస్సులో 36 లక్షల చోరీ...
X

దిశ, జడ్చర్ల : తెలంగాణ ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ నుంచి కర్నూలు వెళుతున్న ప్యాసింజర్ వద్ద ఉన్న 36 లక్షల రూపాయలు చోరీ అయ్యాయి. ఈ ఘటన పై జడ్చర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. పట్టణ సీఐ ఆదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… హైదరాబాదులో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న దామోదర్ అవసరాల నిమిత్తం 36 లక్షలు బ్యాగులో పెట్టుకొని హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ బస్టాండ్ లో తెలంగాణ డిపోకు చెందిన పికెట్ డిపోకు చెందిన TS 09Z7840 నెంబర్ గల బస్సులో ఎక్కి కర్నూలు వెళ్లడానికి టికెట్ తీసుకున్నాడు. ఈ క్రమంలో తన వద్ద ఉన్న పైసల బ్యాగును సీటు పైనున్న క్యాబిన్ లో పెట్టి కూర్చున్నాడు.

మధ్య మధ్యలో లేచి బ్యాగును చూస్తూ ఉన్నాడని జడ్చర్ల సమీపంలోకి రాగానే బాధితుడు కునుకు తీశాడు. జడ్చర్ల బస్టాండ్ కు బస్సు రాగానే టిఫిన్ చేయడానికి బస్సులో నుండి దిగే సమయంలో తన బ్యాగులో ఉన్న డబ్బు కనిపించకపోవడంతో బస్సులోని తోటి వారితో వాకాపు చేశాడు. బస్సులో ప్రయాణిస్తున్న ఒక తోటి ప్రయాణికుడు చిటికి మాటికి లేస్తూ బ్యాగులు సదురుతూ కనపడ్డాడని, ఆ వ్యక్తి జడ్చర్ల బస్టాండ్ లో దిగినట్లు తోటి ప్రయాణికులు తెలిపారు. దీంతో బస్సు డ్రైవర్ కండక్టర్ బాధితుడిని తీసుకొని జడ్చర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని సీఐ తెలిపారు. దీంతో కేసు నమోదు చేసుకొని బస్టాండ్ పరిసరాల్లో బస్ స్టాప్ లో ఉన్న సీసీ కెమెరాలు ఆధారంగా కేసు దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ తెలిపారు.

చెల్లెలికి అత్యవసరంగా డబ్బులు అవసరం ఉండటంతో తీసుకెళ్తున్న బాధితుడు తెలిపాడు. కర్నూల్ లో నివాసం ఉంటున్న తన చెల్లెలికి అత్యవసరం గా 36 లక్షల రూపాయలు అత్యవసరం ఉండడంతో తన ఉద్యోగంలో తనకు రావాల్సిన పిఎఫ్ నుండి డబ్బులు 29 లక్షలు తీసుకుని మిగతా డబ్బులు బయట నుండి సమకూర్చుకొని మొత్తం 36 లక్షల రూపాయలు తన చెల్లెలికి అత్యవసరంగా అందించడానికి హైదరాబాదులోని కడప బస్సు ఎక్కి కర్నూల్ వెళ్తున్నానని మధ్యలో జడ్చర్ల బస్ స్టాప్ లో బస్సు ఆపడం తో టిఫిన్ చేయడానికి దిగే సమయంలో తన బ్యాగు చూసేసరికి తన బ్యాగులో డబ్బులు కనిపించడం లేదని దీంతో తాను జడ్చర్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు దామోదర్ ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed