- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గులాబీ గూటికీ బీజేపీ నేతలు.. స్వయంగా కండువా కప్పిన కేసీఆర్
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీలోకి బీజేపీ నేతలు చేరారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా పార్లమెంటరీ నియోజవర్గం బీజేపీకి చెందిన మాజీ ఎంపీ బుద్దసేన్ పటేల్ మంగళవారం ప్రగతి భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నరేశ్ సింగ్ గుర్జార్, ఎస్పీకి చెందిన సాత్నా మాజీ ఎమ్మెల్యే ధీరేంద్ర సింగ్, సాత్నా మాజీ జిల్లా పంచాయత్ సభ్యురాలు విమల బాగ్రి, సర్వజన్ కళ్యాణ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు సంజయ్ యాదవ్, భోపాల్ కు చెందిన రాకేశ్ మాల్వీయ, సత్యేంద్ర సింగ్ తదితరులు బీఆర్ఎస్ లో చేరారు. మాజీ ఎంపీ బుద్ధసేన్ పటేల్ ను మధ్యప్రదేశ్ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కో ఆర్డినేటర్ గా నియమించారు. నియామకపత్రాన్ని కేసీఆర్ అందజేశారు.ఈ కార్యక్రమంలో చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఉన్నారు