Madhu Yashki: కూలర్లు పెట్టుకొని పడుకుంటే కంపు పోదు.. మాజీ ఎంపీ హాట్ కామెంట్స్

by Ramesh Goud |
Madhu Yashki: కూలర్లు పెట్టుకొని పడుకుంటే కంపు పోదు.. మాజీ ఎంపీ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: కిషన్ రెడ్డి(Kishan Reddy) కేంద్రమంత్రి(Union Minister)గా ఉండి ఆరు సంవత్సరాల నుండి తెలంగాణ(telangana)కు తీసుకొచ్చిన నిధులు(Funds) ఎన్ని? అని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్(Madhu Yashki Goud) ప్రశ్నించారు. శనివారం బహిరంగ సభలో బీజేపీ నేతలు(BJP Leaders) చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. సంచలన విమర్శలు చేశారు. కిషన్ రెడ్డి నిధులు తీసుకొచ్చింది.. అభివృద్ది చేసింది ఏం లేదని, కనీసం తాను ప్రాతినిధ్యం వహించే అంబర్ పేట(Amberpeta)ను కూడా బాగు పరచలేదని మండిపడ్డారు.

సాక్స్ వేసుకొని కూలర్లు పెట్టుకుని మూసీలో పడుకున్నంత మాత్రాన మూసి మురికి కంపు పోదని, పేదలకు ఇళ్లు రావని విమర్శలు చేశారు. భారతీయ జూటా పార్టీ నేతలు అభివృద్ది కోసం ఏం చేయకుండా.. దొంగే దొంగా, దొంగా అని అరిచినట్టు కాంగ్రెస్ పై దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ పెట్టిన బహిరంగ సభలో రెండు వేల మంది కూడా లేరని, ఖాళీ కుర్చీలకు ప్రసంగాలు ఇచ్చి వెళ్లారని ఎద్దేవా చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తూ వస్తున్నామని, ముఖ్యంగా హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా అభివృద్ది చేసేందుకు రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కృషి చేస్తున్నారని తెలిపారు. దీని కోసం వందల కోట్లు కేటాయించారని వివరించారు. ప్రజలు బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పి కొట్టి, ప్రజా పాలనను ఆశీర్వదించాలని మధుయాష్కీ కోరారు.

Advertisement

Next Story

Most Viewed