- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mad dog: పిచ్చికుక్క స్వైర విహారం.. 10 మందికి గాయాలు
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో నిత్యం పిల్లలు, వృద్ధులు, మహిళలపై కుక్కల దాడుల కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎక్కడో ఒకచోట పిచ్చికుక్కలు(Mad dog) దాడి(attack) చేస్తూనే ఉన్నాయి. తాజాగా వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ (Narsampet municipality)లో ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. సీతారాంపురం తాటి వనం ప్రాంతంలో దారివెంట పోతున్న 10 మందిపై దాడి చేసి గాయపరిచింది. కాగా కుక్క దాడిలో తీవ్రంగా గాయాలు కావడంతో వారిని వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎంజీఎం(MGM) ఆస్పత్రికి తరలించారు. పిచ్చికుక్క కనిపించిన వారిపై దాడి చేస్తుండటంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవ్వుతున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి సదరు పిచ్చికుక్కను కట్టడి చేయాలని.. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.