మద్యం ప్రియులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్

by Bhoopathi Nagaiah |   ( Updated:2024-07-05 08:59:37.0  )
మద్యం ప్రియులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్యం ప్రియులకు బిగ్ షాక్ ఇచ్చింది. ఈ నెలలో రెండు రోజులు మద్యం దుకాణాలను మూసేస్తున్నట్లు ప్రకటించింది. సాధారణంగా పెద్ద పండుగలు, భారీ ఊరేగింపులు, ఎన్నికల నేపథ్యంలోనే మద్యం దుకాణాలను మూసేస్తారు. కానీ ఈసారి గతానికి భిన్నంగా మొహరం, బోనాల పండుగల నేపథ్యంలో మద్యం దుకాణాలకు బంద్ ప్రకటించారు. జూలై 17న మొహరం ఉండగా, ఈ నెల 21న బోనాల పండుగ ఉంది. ఈ నేపథ్యంలో ఆ రెండు రోజులు రాష్ట్రంలోని వైన్స్‌లు, బార్లను మూసివేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed