చరిత్ర సృష్టించిన తెలంగాణ మందుబాబులు.. 4 రోజుల్లో చెరపలేని రికార్డ్

by GSrikanth |
చరిత్ర సృష్టించిన తెలంగాణ మందుబాబులు.. 4 రోజుల్లో చెరపలేని రికార్డ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో నాలుగు రోజుల్లో లిక్కర్ విక్రయాలు రూ.770 కోట్లకు పెరిగాయి. లిక్కర్, బీరు కలిపి నాలుగు రోజుల్లో దాదాపు 15 లక్షల కేసులు విక్రయాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ అధికారులు వెల్లడించారు. డిసెంబర్ 31వ తేదీన ఒక్కరోజే రూ.313 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు పేర్కొన్నారు. ఈనెల 29,30,31 తేదీల్లో రూ.658 కోట్ల మేర మద్యం, బీరు విక్రయాలు జరగ్గా.. జనవరి 1వ తేదీన సోమవారం కూడా భారీగానే విక్రయాలు జరిగినట్లు అబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు. సోమవారం ఒక్కరోజే రూ.112 జరిగాయని వెల్లడించారు. ముందస్తుగా ఈవెంట్లు ఫిక్స్ చేసుకున్న వారితో పాటు క్లబ్బులు, పబ్‌లకు పెద్ద మొత్తంలో మద్యం తరలించారు. డిసెంబర్ 31 ఆదివారం రావడంతో విక్రయాలు భారీగా పెరిగాయని అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story