Liquor : మద్యం ప్రియులకు బిగ్ షాక్.. లిక్కర్ ధరలు పెంపు?

by Rajesh |
Liquor : మద్యం ప్రియులకు బిగ్ షాక్.. లిక్కర్ ధరలు పెంపు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: త్వరలో లిక్కర్ రేట్లను ప్రభుత్వం పెంచనుందా? దసరా పండుగకు ముందు ఆ మేరకు నిర్ణయం తీసుకోనుందా? ఈ ప్రశ్నలకు ఆదాయ అంచనాలను చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. స్టేట్ ఓన్ రెవెన్యూలో అధిక భాగం ఎక్సయిజ్ ఆదాయం నుంచే సమకూరుతున్నది. ఈ ఏడాది అదనంగా ఎక్సయిజ్ శాఖ నుంచి సుమారు రూ. 10 వేల కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్‌లో పేర్కొన్నారు. స్టేట్ ఎక్సయిజ్ సుంకం నుంచి గతేడాది రూ. 20,290 కోట్ల ఆదాయం సమకూరగా, ఈసారి అదనంగా రూ. 5,400 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనాల్లో పేర్కొన్నారు. అలాగే లిక్కర్‌పై వ్యాట్ రూపంలో అదనంగా రూ. 4 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. దీంతో ఎక్సయిజ్ నుంచి దాదాపు రూ. 10 వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావిస్తున్నది.

భూ రేట్ల పెంపుతో రూ.4 వేల కోట్ల ఆదాయం

ప్రస్తుతం అమలులో ఉన్న భూమి రేట్లను పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత కొత్త రేట్లను ప్రకటించి, వెంటనే అమలు చేయాలని భావిస్తున్నది. పెరిగిన భూమి, రిజిస్ట్రేషన్ చార్జీలతో అదనంగా రూ. 4 వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తున్నది. గతేడాది స్టాప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి రూ. 14,297 కోట్ల ఆదాయం సమకూరగా, ఈసారి రూ. 18,228 కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్నారు.



Next Story