మన సంస్కృతి, మూలాలు మరువొద్దు : President Draupadi Murmu

by Nagaya |   ( Updated:2022-12-27 10:32:00.0  )
మన సంస్కృతి, మూలాలు మరువొద్దు : President Draupadi Murmu
X

దిశ, డైనమిక్ బ్యూరో: మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మన మూలాలు, సంస్కృతి మరవొద్దని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శీతాకాలం విడిది కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఆమె మంగళవారం హైదరాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కాలేజీలో ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్‌లో రాష్ట్రపతి పాల్గొని విద్యార్థులు, అధ్యాపకులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రాంతీయ స్వాతంత్య్ర సమరయోధుల కృషిని ప్రదర్శించే 'హైదరాబాద్ విమోచన ఉద్యమం'పై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ విముక్తి కోసం పోరాడిన రాంజీ గోండ్, తుర్రేబాజ్ ఖాన్, కొమరం భీమ్, సురవరం ప్రతాప్ రెడ్డి, షోయాబుల్లాఖాన్ వంటి వీర నాయకులకు ఆమె నివాళులర్పించి, వారి శౌర్యాన్ని, త్యాగాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటారని, గౌరవిస్తారని అన్నారు.

మన పూర్వికులు వేసిన పునాదులను విస్మరించకుండా భవిష్యత్ నిర్మాణం చేసే బాధ్యత భారతదేశంలోని యువతపై ఉందన్నారు. బాధ్యతయుతమైన పౌరులుగా ఉండటం అంటే రాజ్యాంగం యొక్క విలువలు, ఆదర్శాలను సమర్థించడం అసమానతలు లేని సమాజం కోసం పని చేయడం అన్నారు. దేశ నిర్మాణానికి విద్య పునాది అని నూతన విద్యా విధానం క్రియేటివిటీ మేల్కొలుపుతుందన్ని అన్నారు. ఈ విధానం దేశాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుదని చెప్పారు. పఠనం యొక్క ప్రాముఖ్యతను వివరించిన రాష్ట్రపతి.. స్వీయ అభివృద్ధికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో చదివే అలవాటు ఒకటని అన్నారు. ఏ రంగంలోనేనా ఆత్మసంతృప్తి చాలా ముఖ్యమని, పక్క వాళ్లతో పోల్చుకుని జీవిస్తే ఒత్తిడి పెరుగుతుందన్నారు. సమాజంలో అందరూ సమానమేనని గ్రామం, గిరిజన ప్రాంతం నుంచి వచ్చామనే ఆత్మనూన్యతను దరిచేరనీయొద్దని సూచించారు.

స్త్రీ, పురుషులు అన్న తేడా ఉండకూడదని చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారని తల్లిదండ్రులు పిల్లలకు చిన్ననాటి నుంచే విలువలు నేర్పించాలని సూచించారు. పక్కవారితో పోల్చుకోవడంలో సంతృప్తి లేదని అన్ని విషయాలను అమెరికాతో పోల్చుకోవద్దన్నారు. భారత్‌లో ఉన్నంత స్థాయిలో జనాభా అమెరికాలో లేదని అలాగే భారత్‌లో ఉన్నన్ని కులాలు, భాషలు, వైవిధ్యం అమెరికాలో లేదన్నారు. హైదరాబాద్ అవకాశాలకు కేంద్రంగా ఉందని వాటిని అందిపుచ్చుకోవాలన్నారు. మనిషికి మనిషికి మధ్య. ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని అభిప్రాయ పడ్డారు.

Also Read...

నాగలి చేత పట్టి పొలం దున్నిన మంత్రి ఎర్రబెల్లి

Advertisement

Next Story

Most Viewed