‘అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ముందుకు సాగుదాం’

by Sathputhe Rajesh |
‘అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ముందుకు సాగుదాం’
X

దిశ, తెలంగాణ బ్యూరో : దళితుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి అంబేద్కర్ అని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం అసెంబ్లీ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ రూపకర్తగా, న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, రాజకీయ నేతగా, సంఘ సంస్కర్తగా ఇలా అన్ని రంగాల్లో సేవ చేసిన మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు.

అంటరానితనం, కుల నిర్మూలనే లక్ష్యంగా అనేక ఉద్యమాలు చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచారన్నారు. దళితుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేశారన్నారు. ద‌ళితుల‌కు ప్రత్యేక నియోజ‌క‌వ‌ర్గాలు ఉండాల‌ని మొద‌ట పోరాటం చేసింది అంబేద్కరే అన్నారు. తనకు జరిగిన అవమానం ఇంకెవరికి జరగొద్దని దేశ న్యాయ మంత్రి అయ్యాక‌... ద‌ళితుల‌కు రిజ‌ర్వేషన్లను క‌ల్పించింది కూడా అంబేద్కర్ అన్నారు. మ‌న దేశ రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత పెద్ద రాజ్యాంగం అన్నారు. ఈ కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ సెక్రటరీ నరసింహచార్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed