- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రగతిభవన్‌ను మ్యూజియంగా చేస్తాం: RS ప్రవీణ్ కుమార్
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బీఎస్పీ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం క్యాంప్ ఆఫీస్ అయిన ప్రగతిభవన్‌ను మ్యూజియంగా తయారు చేసి.. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్న పాలకుల దోపిడీని మన బిడ్డలకు చూపిద్దామని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం ఫ్లోరిడా నగరంలో గ్లోబల్ ఎన్ఆర్ఐ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మంచిగా ఉన్నా సెక్రటేరియట్, జిల్లా కలెక్టరేట్లను కూల్చి మళ్లీ కట్టడం అనేది ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడమేనని మండిపడ్డారు. కాళేశ్వరంలో కూడా భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. తెలంగాణ నంబర్ అని చెప్పుకోవడానికి అడ్వటైజ్మెంట్ పేరుతో ప్రజల డబ్బు రూ.32 కోట్లను ఖర్చు చేశారని ఎన్నారైలకు వివరించారు.
రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పాలకులు పట్టించుకోవడం లేదని తేల్చి చెప్పారు. ఇటీవల రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో, యూనివర్సిటీల్లో నాణ్యత లేని ఆహారం పెడుతున్నారని, ఎంతో మంది విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యా వ్యవస్థను కూడా మన పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు. ఇబ్రహీంపట్నంలో ఆపరేషన్ వికటించి నలుగురు మహిళలు చనిపోవడం, వరంగల్ ఆస్పత్రిలో పందికొక్కులు కరువడంతో వ్యక్తి చనిపోవడం, మహబుబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో పాములు రావడం ఇలా ఎన్నో ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులలో జరుగుతున్నాయని, పేదలు ప్రాణాలు కోల్పొతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
గురుకులాలు అందరికీ అందుబాటులోకి తెస్తాం
రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను పక్కన పెట్టి లిక్కర్ అమ్మకాలపై దృష్టి సారించిందని తెలిపారు. బీఎస్పీ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల పేదలకు విద్యాను అందించడమే లక్ష్యంగా గురుకులాలను అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేసి ప్రజలందరి డేటాను సీఎం దగ్గర పెట్టుకున్నారని, ఎలక్షన్ వచ్చినప్పుడు వారికి అనుగుణంగా డేటాను సీఎం వాడుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న ప్రవాస భారతీయులు ఆర్ఎస్పీకి సంపూర్ణ మద్దతును తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ ఎన్ఆర్ఐ ఫోరం ప్రతినిధులు వెంకట్ మారోజు, రాయ్ మంతెన, రాజశేఖర్ కడారి, రిటైర్డ్ ఐఏఎస్ ప్రదీప్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.