- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్‌లో మండలి చైర్మన్ గుత్తా దుమారం.. కేసీఆర్, కేటీఆర్ టార్గెట్‌గా సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేతలపై ఆ పార్టీ నేత, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు చేయడం సరికాదని చురకలు అంటించారు. సుంకిశాల ప్రాజెక్ట్ ఎందుకు ప్రారంభించారో మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్‌కే తెలియాలి అని ఎద్దేవా చేశారు. జంట నగరాలకు తాగునీరు అందించేందుకు సుంకిశాలతో అవసరం లేదని అన్నారు. ఇది కేసీఆర్ మానస పుత్రికనో.. కేటీఆర్ మానస పుత్రికనో తెలియడం లేదని పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు.
కృష్ణా బేసిన్‌లోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో గత బీఆర్ఎస్ పాలకులు నిర్లక్ష్యం చేశారని, దీంతో నల్గొండ జిల్లాకు అన్యాయం చేశారని విమర్శించారు. గోదావరి నదిపైన ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేసి, కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను అశ్రద్ధ చేశారని విమర్శలు సంధించారు. గత ప్రభుత్వం.. కాళేశ్వరం ప్రాజెక్టుపై చూపిన శ్రద్ధ, కృష్ణా బేసిన్‌లో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై చూపలేదని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసి, జిల్లాను సస్యశ్యామలం చేయాలని ఆయన సీఎం రేవంత్, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు సూచించారు. అయితే, గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్‌లో దుమారం రేపుతున్నాయి. దీనిపై ఆ పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.