- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
LB నగర్ యువతిపై దాడి కేసు : వెలుగులోకి సంచలన విషయాలు
దిశ, వెబ్‌డెస్క్: ఎల్బీ నగర్‌లో యువతి, ఆమె తమ్ముడిపై దాడి కేసులో విచారణ సందర్భంగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు శివకుమార్ గత నేర చరిత్ర, మానసిక స్థితిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 3ఏళ్ల క్రితం తండ్రిని కూడా శివకుమార్ చంపాడని గ్రామస్తులు తెలిపారు. అడ్డదారుల్లో వెళ్లొద్దన్నందుకు తండ్రిని సుత్తితో కొట్టి చంపాడని గ్రామస్తులు పోలీసులకు తెలిపారు. శివకుమార్ భవిష్యత్తు దృష్ట్యా హత్యను గ్రామస్తులు దాచిపెట్టినట్లు తెలిసింది. అప్పటినుంచి ఉన్మాది మాదిరిగా శివకుమార్ ప్రవర్తిస్తున్నాడు. యువతి పరిచయం కాగా ప్రేమించడాలని శివకుమార్ వేధింపులు ప్రారంభించాడు.
యువతి పలుమార్లు వ్యతిరేకించడంతో శివకుమార్ కక్ష పెంచుకున్నాడు. యువతిని హతమార్చాలని శివకుమార్ కత్తితో దాడి చేసాడు. కాగా దాడితో యువతి సోదరుడు పృథ్వీరాజ్ మృతి చెందిన విషయం తెలిసిందే. తీవ్రగాయాలతో బాధిత యువతి గచ్చిబౌలిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇక, శివకుమార్, యువతి పదో తరగతి వరకు ఒకే స్కూల్‌లో చదువుకున్నట్లు తెలిసింది. డిగ్రీ పూర్తి చేసి సినిమాలపై ఆసక్తితో శివకుమార్ హైదరాబాద్‌లో తిరిగాడు. శివకుమార్ కు యువతి మళ్లీ సామాజిక మాధ్యమాల్లో పరిచయమైనట్లు పోలీసులు గుర్తించారు.