- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎల్బీనగర్లో రోడ్డెక్కిన న్యాయవాదులు.. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు
by Mahesh |
X
దిశ, వెబ్ డెస్క్: న్యాయవాదుల ఆందోళన ఎల్బీనగర్ ప్రాంతంలో ఒక్కసారిగా రవాణా వ్యవస్థ స్థబించి పోయింది. మూడు రోజుల క్రితం జనగామ జిల్లాలో న్యాయవాద దంపతులపై పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాదులు మొత్తం ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి ధర్నా నిర్వహించారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కోర్టు ముందు న్యాయవాదుల ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్ ను పునరుద్ధరించే పనిలో పడ్డారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మీడియాతో మాట్లాడుతూ.. జనగాంలో న్యాయవాద దంపతులపై దాడికి పాల్పడిన పోలీస్ అధికారుల్ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది.
Advertisement
Next Story