- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Lagacharla: రేవంత్ రెడ్డి ఇదేనా మీ ఏడో హామీ?.. మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్
దిశ, వెబ్ డెస్క్: రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఇదేనా మీరు చెప్పిన ప్రజాస్వామ్యపాలన(Democracy) అని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు(BRS Leader Harish Rao) అన్నారు. లగచర్ల(Lagacharla)కు వెళ్తున్న సామాజిక కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకుంటున్నారని ఓ నెటిజన్ పెట్టిన పోస్టుకు స్పందించిన ఆయన.. ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా.. నిజనిర్ధారణ కోసం లగచర్లకు వెళ్తున్న సామాజిక కార్యకర్తల్ని(Social Workers) పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. అలాగే పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్య, ఇతర మహిళా సభ్యుల పట్ల ప్రభుత్వ నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండించారు.
రేవంత్ రెడ్డి ఇదేనా మీరు చెప్పిన ఏడో హామీ అయిన ప్రజాస్వామ్య పాలన అని ఎద్దేవా చేశారు. కంచెలు, ఆంక్షలు, నిర్బంధాలు లేని పాలన అన్నారు. కానీ, అవి లేకుండా మీ పాలనలో రోజు గడవడం లేదని తెలిపారు. లగచర్ల గిరిజన బిడ్డలకు జరిగిన అన్యాయం వెలుగు చూడకుండా ఎంత మందిని అడ్డుకుంటారని, అక్రమ కేసులు పెడుతూ ఇంకెంత మంది నోళ్ళు మూయిస్తారని ప్రశ్నించారు. అంతేగాక అధికారం ఉందని రేవంత్ రెడ్డి సాధారణ ప్రజలనే కాదు, జర్నలిస్టులు(Journalists), మానవహక్కుల కార్యకర్తలను(Human Rights Activists) నిర్బంధాలకు గురిచేస్తున్నాడని, నిర్బంధ, నిరంకుశ, రాక్షస పాలన కొనసాగిస్తున్నాడుని హరీష్ రావు సంచలన వ్యాక్యలు చేశారు.