‘‘అది మనందరి బాధ్యత’’.. పర్యాటకులకు మంత్రి కేటీఆర్ కీలక విజ్ఞప్తి

by Satheesh |   ( Updated:2023-05-30 13:02:07.0  )
‘‘అది మనందరి బాధ్యత’’.. పర్యాటకులకు మంత్రి కేటీఆర్ కీలక విజ్ఞప్తి
X

దిశ, డైనమిక్ బ్యూరో: నగరంలోని పర్యాటక ప్రదేశమైన ట్యాంక్‌బండ్‌ను పర్యాటకులు అపరిశుభ్రంగా తయారుచేస్తున్నారు. పర్యాటక ప్రాంతాన్ని చెత్తాచెదారంతో నింపి కంపుకంపు చేస్తున్నారు. రాత్రి వేళల్లో తినుబండారాల‌కు సంబంధిన ప‌దార్థాల‌ను, కేకుల‌ను ఇత‌ర‌త్రా వ్యర్థాల‌ను అక్కడే ఇష్టం వచ్చినట్లు పడేస్తున్నారు. ఈ విషయమై మంత్రి కేటీఆర్ త‌న ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో ద్వారా సందేశాన్ని ఇచ్చారు.

‘మహానగరానికి మణిహారం ట్యాంక్‌బండ్!. శతాబ్దాల ఘన చరిత్రకు ప్రతీక ట్యాంక్‌బండ్! అందుకు తగ్గట్టే.. ట్యాంక్‌బండ్ సుందరీకరణను ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ఈ విశిష్ట నిర్మాణానికి మరిన్ని మెరుగులు అద్ది.. ట్యాంక్‌బండ్‌ను అత్యంత అందంగా తీర్చిదిద్దింది తెలంగాణ ప్రభుత్వం. నగర ప్రజలకు, పర్యాటకులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని అందిస్తూ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచుతున్న ట్యాంక్‌బండ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూడటం మనందరి బాధ్యత. మనం నివసించే ఇంటిలాగానే మనకు గర్వకారణం అయిన పర్యాటక ప్రదేశాల్లో కూడా పరిశుభ్రతను పాటించాలని ప్రజలందరికి విజ్ఞప్తి చేస్తున్నాను’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

Also Read..

రాబోయే ఎంపీ ఎన్నికల్లో కవితను భారీ మెజారిటీతో గెలిపించాలి : మంత్రి మల్లారెడ్డి

Advertisement

Next Story

Most Viewed