- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KTR: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. కేటీఆర్ ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కులగణన సర్వేను తాము స్వాగతిస్తున్నట్లు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ప్రకటించారు. కానీ, సర్వేలోభాగంగా అధికారులు అడిగే ప్రశ్నల సంఖ్యను కుదించాలని డిమాండ్ చేశారు. ఆదివారం కేటీఆర్(KTR) హన్మకొండ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ ప్రకటించి ఏడాది అయ్యిందని గుర్తుచేశారు. బీసీ డిక్లరేషన్(BC Declaration)లో భాగంగా ప్రకటించిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటేసిన పాపానికి చేతి వృత్తిదారుల గొంతు కోశారని అన్నారు. కొత్త పథకాల ముచ్చట దేవుడెరుగు.. ఇప్పటికే ప్రకటించిన పథకాలను పాతరేశారని విమర్శించారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. బీసీబంధు, దళితబంధు బంద్ చేశారని మండిపడ్డారు.
కేవలం బీసీల ఓట్ల కోసమే ప్రభుత్వం కులగణన జపం ఎత్తుకుందని ఎద్దేవా చేశారు. కానీ, ఈ కులగణన సర్వే సక్రమంగా జరుగడం లేదని తెలిపారు. గ్రామాల్లో అధికారులను ప్రజలు నిలదీస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ ఓట్ల రాజకీయంలో అధికారులు బలి అవుతున్నారని మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రాజకీయ లబ్ధి కోసమే కులగణన అంటూ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ 11 నెలల్లో ఏం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సాలు చేస్తుందని ప్రశ్నించారు. తాము కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్య వారోత్సవాలు నిర్వహిస్తామని సంచలన ప్రకటన చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి బాంబుల శాఖ ఇవ్వాలని ఎద్దేవా చేశారు.