- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అసెంబ్లీ నుంచి జగదీష్ రెడ్డి సస్పెన్షన్.. బీఆర్ఎస్ శ్రేణులకు KTR సంచలన పిలుపు

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ(Telangana Assembly) నుంచి ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్(BRS) శ్రేణులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సంచలన పిలుపునిచ్చారు. జగదీష్ రెడ్డి(Jagadish Reddy) సస్పెన్షన్ అక్రమం అంటూ గురువారం ట్యాంక్ బండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండి.. ఇక్కడ మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశాలతోనే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారని ఆరోపించారు. సభలో తాము తప్పు మాట్లాడి ఉంటే.. ఆ వీడియోలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తప్పు అని తేలితే తప్పకుండా విచారం వ్యక్తం చేస్తామని అన్నారు. ఏకపక్షంగా సభ నుంచి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అనని మాటను.. అన్నట్లుగా చిత్రీకరించారని అన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసిస్తూ రేపు(శుక్రవారం) రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
కాగా, తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) నుంచి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారు. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధికారికంగా ప్రకటించారు. ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు ఆయనపై సస్పెన్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.
Read More..
ఇలాగే మాట్లాడితే తరిమికొట్టే పరిస్థితి వస్తుంది.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఫైర్