‘చనిపోయిన కనికరించరా..?’.. CM రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ

by Satheesh |   ( Updated:2024-02-02 13:57:05.0  )
‘చనిపోయిన కనికరించరా..?’.. CM రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహలక్ష్మీ స్కీమ్‌లో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోన్న విషయం తెలిసిందే. ఈ స్కీమ్ అమలుతో రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ ఎఫెక్ట్‌తో తమ జీవనోపాధి దెబ్బ తింటుందని.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ స్కీమ్ అమలు తర్వాత సరిగ్గా గిరాకీ లేక ఆర్థిక ఇబ్బందులతో ఇప్పటికే పలువురు ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు సైతం చేసుకున్నారు. ఇదిలా ఉండగానే.. ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఓ ఆటో డ్రైవర్ గురువారం ఏకంగా బేగంపేట్‌లోని ప్రజా భవన్ ముందు తన ఆటోను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు.

ఈ సందర్భంగా కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగా లేఖ రాశారు. ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రోజురోజుకీ పెరిగిపోతున్న ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. ఆర్థిక సమస్యలతో రాష్ట్రంలోని 15 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్న స్పందించరా అని ప్రశ్నించారు. ఏకంగా ప్రజా భవన్ ముందే ఆటో తగలబెట్టిన కనీసం కనికరించరా అని నిలదీశారు. ప్రభుత్వం వెంటనే ఆటో డ్రైవర్లను ఆదుకుని.. ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలన్నారు. బాధిత డ్రైవర్ల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కేటీఆర్ లేఖలో డిమాండ్ చేశారు. ఉపాధి కోల్పోయిన ప్రతి ఆటో డ్రైవర్‌కు ప్రభుత్వం నెలకు రూ.10 వేలు ఇవ్వాలన్నారు.

Advertisement

Next Story