ఖర్గే, రాహుల్‌కు కేటీఆర్ లేఖ.. మాట నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి

by Gantepaka Srikanth |
ఖర్గే, రాహుల్‌కు కేటీఆర్ లేఖ.. మాట నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. రుణమాఫీ పేరుతో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆదివారం రాసిన లేఖలో పేర్కొన్నారు. సీఎం చెప్పిన అబద్ధాలు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకు మధ్య ఉన్న స్పష్టమైన తేడాను ఈ లేఖలో పొందుపరుస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట రైతులకి రెండు లక్షల రుణమాఫీ హామీ ఇచ్చారు.

కానీ ఈ ప్రభుత్వం అనేక షరతులు పెట్టి 40 శాతం మందికి మాత్రమే రుణమాఫీ చేసింది. రూ.40 వేల కోట్ల రుణమాఫీ అని చెప్పి కేవలం 17 వేల కోట్లకు పైగా రుణమాఫీతో రైతులను నట్టేట ముంచింది. మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని రైతులందరికీ రుణమాఫీ చేయాలని తన లేఖలో డిమాండ్ చేసిన కేటీఆర్ లక్షల మంది రైతులు ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా రోడ్లపైన ఆందోళనలను చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి మాయ మాటలు చెప్పి తెలంగాణ రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులందరికీ రుణమాఫీ చేయకుంటే.. వారి తరఫున కాంగ్రెస్ పార్టీపై పోరాడుతామని కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed