- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ అంటే ప్రాణం ఇచ్చే వాళ్లు లక్షల్లో ఉన్నారు: KTR
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు ఎగ్గొట్టే కార్యక్రమాలు ప్రారంభించిందని అన్నారు. కేసీఆర్‌పై, తెలంగాణపై ప్రేమ ఉన్నవారు గ్రామాల్లో లక్షల్లో ఉన్నారని చెప్పారు. పదవులు రాలేదన్న బాధ నాయకుల్లో ఉండొచ్చు కానీ, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో లేదని అన్నారు. ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. మిగతా నాలుగేళ్లు కార్యకర్తలే నాయకులను కాపాడుతారని అన్నారు. పదేళ్ల పాటు పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని ప్రధాని మోడీ నమ్మబలికారని విమర్శించారు.
పదేళ్లు పూర్తయినా పాలమూరు పథకానికి జాతీయ హోదా ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. కర్ణాటకలో అప్పర్‌భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారని గుర్తుచేశారు. కృష్ణానదిపై ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి ఇచ్చిందని అన్నారు. కాంగ్రెస్ నేతలను స్వంత్రత ఉండదని.. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీకి వెళ్లా్ల్సిందే అని చెప్పారు. వేసవి కాలం రాకముందే రాష్ట్రంలో తాగునీటి సమస్యలు ప్రారంభమయ్యాయని అన్నారు. ఎక్కడ కోల్పోయామో తిరిగి అక్కడే సాధించాలని పార్టీ శ్రేణులను హితవు పలికారు. అచ్చంపేటలో పూర్వ వైభవం కోసం అందరం కృషి చేద్దామని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో 14 ఏళ్లు ఉద్యమం చేశామని అన్నారు. అనంతరం పదేళ్లు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.