- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మియాపూర్ గుడిసే వాసుల ఘటనపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
by Ramesh N |

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, శనివారం మియాపూర్‌లోని ప్రశాంత్ నగర్ సమీపంలో హెచ్‌ఎండీఏ స్థలంలో పేదలు గుడిసెలు వేసేందుకు యత్నించడంతో అక్కడ తాజాగా హైటెన్షన్ నెలకొన్న విషయం తెలిసిందే. అయితే, దాదాపు 2 వేల మంది గుడిసెలు వేసేందుకు ప్రయత్నించగా.. వారిని అడ్డుకునే క్రమంలో పోలీసులు అదనపు బలగాలను రప్పించి లాఠీఛార్జి చేశారు. దీంతో వారు పోలీసులపై రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తతకు దారితీసింది.
పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టడంపై తాజాగా ట్విట్ట్ వేదికగా కేటీఆర్ స్పందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని స్పష్టం చేశారు. అలాగే, గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా చూశారా అని పేర్కొన్నారు.
Next Story