71 ఏళ్లలో ముస్లింలకు ఈ పరిస్థితి ఏనాడూ రాలేదు: కేటీఆర్

by GSrikanth |
71 ఏళ్లలో ముస్లింలకు ఈ పరిస్థితి ఏనాడూ రాలేదు: కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర కేబినెట్‌లో మైనార్టీలకు స్థానం ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. 1953 తర్వాత మైనార్టీలకు కేబినెట్‌లో స్థానం దక్కకపోవడం ఇదే తొలిసారి అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారని అంతా అనుకున్న సమయంలో ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చి చేతులు దులుపుకున్నారని అన్నారు. కేబినెట్‌లో మైనార్టీలకు సముచిత స్థానం కల్పించకపోవడం వారి ఆత్మగౌరవాన్ని కించపరచడమే అని అన్నారు.

గత ఎన్నికల్లో మైనార్టీలు బీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వడం మూలంగానే మైనార్టీలను సీఎం రేవంత్ రెడ్డి పగబట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలది ఫెవికాల్ బంధం అని చెప్పారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ బీజేపీ, కాంగ్రెస్ పరోక్షంగా కలిసే పోటీ చేస్తాయని అన్నారు. ఈ రెండు పార్టీలు మంచి అవగాహనతో కలిసి పని చేస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి అదానీని తిట్టి.. అధికారంలోకి రాగానే దావోస్ వెళ్లి ఒప్పందాలు చేసుకొని వచ్చారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు లబ్ధి చేకూర్చేలా బీజేపీ పనిచేసిందని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed