- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిన్ను చరిత్ర క్షమించదు.. CM రేవంత్‌పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు బుధవారం సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు. ‘తెలంగాణ సోయి లేనోడు సీఎం కావడం ఖర్మ.. తెలంగాణ ఆత్మగౌరవం విలువ తెల్వనోడు ముఖ్యమంత్రిగా ఉండటం మన దౌర్భాగ్యం.. అసలు గోల్ మాల్ గుజరాత్ మోడల్‌కు.. గోల్డెన్ తెలంగాణ మోడల్‌తో పోలికెక్కడిది.. ఘనమైన “గంగా జెమునా తెహజీబ్ మోడల్” కన్నా.. మతం పేరిట చిచ్చు పెట్టే “గోద్రా అల్లర్ల మోడల్” నీకు నచ్చిందా..? నిన్నటి దాకా గుజరాత్ మోడల్‌పై నిప్పులు.. ప్రధాని పక్కన సీటు ఇవ్వగానే గొప్పలా? ఇదేం నీతి.. ఇదేం రీతి..
తెలంగాణ మోడల్ అంటే.. సమగ్ర అభివృద్ధికి చిరునామా.. అనేక రాష్ట్రాలు మెచ్చిన మోడల్.. యావత్ దేశానికే నచ్చిన మోడల్.. దేశం మెచ్చిన ఈ తెలంగాణ నమూనాను మోడీ ముందు కించ పరుస్తావా..? నమ్మి ఓటేసిన తెలంగాణపై ఎందుకీ నయవంచన? నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మోడీ కాళ్ల దగ్గర తాకట్టు పెడతావా..?? నాడు తెలంగాణ “ఉద్యమకారులపై రైఫిల్ ఎత్తావ్.. నేడు “తెలంగాణ ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టావ్.. నిన్ను చరిత్ర క్షమించదు. నా తెలంగాణ దేనినైనా సహిస్తుంది కానీ.. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే మాత్రం ఊరుకోదు. తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని ఆకాశమంత ఎత్తుకు ఎత్తింది బీఆర్ఎస్.. కానీ.. నేడు పాతాళంలో పాతిపెట్టేస్తోంది కాంగ్రెస్’’ అని ఎక్స్(ట్విట్టర్) వేదికగా కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.