E-Car Race : కేసుల నుంచి తప్పించుకోవడానికే కేటీఆర్ ఢిల్లీ టూర్.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

by Ramesh N |
E-Car Race : కేసుల నుంచి తప్పించుకోవడానికే కేటీఆర్ ఢిల్లీ టూర్.. మంత్రి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హూటాహుటిన సోమవారం ఢిల్లీకి బయలు దేరిన విషయం తెలిసిందే. ఆయన ఇవాళ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్ర మనోహర్‌లాల్ ఖట్టర్‌ను కలవబోతున్నారు. కేటీఆర్ ఢిల్లీ టూర్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) స్పందించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. తనపై వస్తున్న ఆరోపణలు, కేసుల నుంచి తప్పించుకోవడానికే కేటీఆర్ ఢిల్లీ టూర్ అంటూ మంత్రి ఆరోపించారు.

(E-Car Race) ఈ-కార్ రేసు అంశంలో కేటీఆర్‌పై అభియోగాలు వస్తున్నాయని, కేసువిచరణపై గవర్నర్ అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని వెల్లడించారు. ఈ కార్ రేసు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని ఆరోపించారు. దీని నుంచి తప్పించుకునేందుకు ఢిల్లీ వెళ్తున్నారని ఆరోపించారు. (BRS) బీఆర్ఎస్‌కు (BJP) బీజేపీతో చీకట ఒప్పందం ఉందని, కేసుల నుంచి తప్పించుకునేందుకు కేటీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా కేటీఆర్ తన నిజాయితీ నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story