రేపు మహిళా కమిషన్ ముందుకు కేటీఆర్

by M.Rajitha |
రేపు మహిళా కమిషన్ ముందుకు కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి, మహిళా కమిషన్ చేత నోటీసులు అందుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ విచారణ కొరకు రేపు కమిషన్ ముందు కేటీఆర్ హాజరు కానున్నారు. 'మహిళలు బస్సుల్లో బ్రేక్ డాన్సులు కూడా చేసుకోండి' అంటూ ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించి.. సుమోటోగా స్వీకరించింది. ఈనెల 24న కమిషన్ ముందుకు హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. తాను మహిళా కమిషన్ ముందు హాజరవుతాను అని ప్రకటించిన కేటీఆర్, బహిరంగ క్షమాపణలు కూడా తెలియ జేశారు. ‘గత 8 నెలల్లో మహిళలపై జరిగిన ఘటనల వివరాలను, అలాగే బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం, కాంగ్రెస్ నేతలు చేసిన కామెంట్లను కమిషన్ దృష్టికి తీసుకెళ్తానని, తాను చట్టాలను గౌరవించే వ్యక్తిని’ అని కేటీఆర్ అన్నారు.

Next Story

Most Viewed