- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
KTR: రేపు ఈడీ విచారణకు కేటీఆర్.. ఏం చెప్పనున్నారు?
దిశ, తెలంగాణ బ్యూరో : ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏ-1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు రేపు విచారించనున్నారు. ఈడీ ఆఫీసర్లు అడిగిన ప్రశ్నలకు ఆయన ఏం సమాధానం చెబుతారన్న దానిపై ఉత్కంఠ నెలకొన్నది. ఈ నెల 9వ తేదీన ఏసీబీ అధికారులు విచారించిన సమయంలో ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి నిధుల బదిలీ తన ఆదేశాల మేరకు జరిగాయని తెలిపినట్టు విచారణ అనంతరం కేటీఆర్ మీడియా ఎదుట స్పష్టం చేశారు. అదే విషయాన్ని ఈడీ విచారణలోనూ చెబుతారా.. లేక ఇంకేమైనా చెప్పే అవకాశం ఉన్నదా ? అనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఈ కేసులో ఏ-2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్‌ను, ఏ-3గా ఉన్న హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్‌రెడ్డిలను ఈడీ అధికారులు విచారించి వారి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా డిసెంబర్ 20న ఈడీ అధికారులు ఫార్ములా ఈ కార్ రేస్ కేసు నమోదు చేశారు.
పై ఆఫీసర్ల ఆదేశాలు పాటించానన్న బీఎల్‌ఎన్ రెడ్డి
ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏ-3గా ఉన్న హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిని ఈ నెల 8వ తేదీన ఈడీ అధికారులు విచారించి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆయన ‘పై అధికారుల ఆదేశాల మేరకే ఫార్ములా ఈ కార్ రేస్ ప్రొసీడింగ్ జరిగింది’ అని వెల్లడించినట్టు తెలిసింది. సుమారు 9 గంటల పాటు ఆయన్ను ఎంక్వయిరీ చేసిన అధికారులు కారు రేసు అగ్రిమెంట్ జరిగిన తీరు, నిర్వహణ కోసం రోడ్ల మరమ్మతులు, ఇతర కార్యక్రమాలకు హెచ్ఎండీఏ ఎంత ఖర్చు చేసింది? ఏ ప్రతిపాదికన నిధులు విడుదల జరిగింది? అనే కోణాల్లో ప్రశ్నించినట్టు సమాచారం.
కేటీఆర్ ఆర్డర్స్ మేరకే జరిగాయన్న అరవింద్
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే మొత్తం ప్రాసెస్ జరిగిందని సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్.. ఈడీ అధికారులకు సమాధానం చెప్పినట్టు తెలుస్తున్నది. ఈ నెల 9న అరవింద్ కుమార్.. ఈడీ విచారణకు హాజరయ్యారు. హెచ్ఎండీఏ నిధులు చెల్లించిన తర్వాత అగ్రిమెంట్ జరిగిందన్న విషయంపై ఆఫీసర్లు ఆయన్ను ప్రశ్నించినట్టు తెలిసింది. నిధుల చెల్లింపుపై ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు ఏ నిబంధనల మేరకు ప్రతిపాదనలు పంపారని ప్రశ్నించారని సమాచారం.