KTR: మరోసారి ఢిల్లీకి వెళ్లిన కేటీఆర్.. ఒకే టూర్‌లో రెండు పనులు..!

by Satheesh |
KTR: మరోసారి ఢిల్లీకి వెళ్లిన కేటీఆర్.. ఒకే టూర్‌లో రెండు పనులు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ మద్యం విధానంపై సీబీఐ నమోదు చేసిన కేసులో తనకు డిఫాల్ట్‌ బెయిల్‌ ఇవ్వాలంటూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం రౌస్‌ ఎవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై కోర్టు విచారించనుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం ఢిల్లీకి వెళ్లారు. సోమవారం కవితతో ములాఖత్ కానున్నారు. అందులో భాగంగానే కవిత కేసును వాదిస్తున్న న్యాయవాదులతో ఆదివారం రాత్రి భేటీ అయినట్లు సమాచారం.

బెయిల్ అంశంపై చర్చించినట్లు తెలిసింది. అదే విధంగా పార్టీ పిరాయింపులపైనా సుప్రీం కోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్లు ఇప్పటికే కేటీఆర్ ప్రకటించారు. అయితే గతంలో ఎమ్మెల్యేలపై ఇతర రాష్ట్రాల్లో అనర్హత కోసం సుప్రీంకోర్టులో వాదించిన న్యాయవాదులతోనూ సోమవారం భేటీ కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే పార్టీమారిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటుకోసం హైకోర్టు, స్పీకర్‌తో పాటు గవర్నర్‌ను బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కలిశారు.

Advertisement

Next Story

Most Viewed