KTR: కాంగ్రెస్ హయాంలో వ్యవసాయానికి గడ్డు కాలమొచ్చింది: కేటీఆర్ సంచలన ట్వీట్

by Shiva |   ( Updated:2024-08-12 06:28:04.0  )
KTR: కాంగ్రెస్ హయాంలో వ్యవసాయానికి గడ్డు కాలమొచ్చింది: కేటీఆర్ సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి గడ్డు కాలం వచ్చిందని మాజీ మంత్రి కేటీఆర్ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. దేశానికి అన్నం పెట్టి అన్నపూర్ణగా ఎదిగిన రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో ఎందుకింద విధ్వంసం జరగుతోందని ప్రశ్నించారు. రాష్ట్రంలో వ్యాప్తంగా ఏడాదిలో 15.30 లక్షల ఎకరాల్లో పంట సాగు విస్తీర్ణం తగ్గిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులకు భరోసానే లేకుండా పోయిందని మండిపడ్డారు. సాగునీటిపై అనిశ్చితి, విత్తనాలు, ఎరువులు వంటి కీలకమైన ఇన్‌పుట్‌లు అందుబాటులో లేకపోవడం, రైతు భరోసా పెట్టుబడికి మద్దతు లభించకపోవడం తెలంగాణ రైతాంగాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆగస్టు 10 నాటికి, ప్రస్తుత వానాకాలం సీజన్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 1.29 కోట్ల ఎకరాలు ఉండగా.. అందులో 84.6 లక్షల ఎకరాల్లో మాత్రమే రైతులు నాట్లు వేశారని తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో అత్యల్ప సాగు విస్తీర్ణం ఇదేనని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ సాధించిన స్థిరమైన అభివృద్ధిని నేడు కాంగ్రెస్ సర్కార్ చేయలేకపోతోందని చెప్పేందుకు ఇదొక ఉదాహరణ అని మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు.

Advertisement

Next Story