KTR: చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తది.. ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు

by Shiva |   ( Updated:2024-10-27 09:36:33.0  )
KTR: చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తది.. ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజలు చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. ఇవాళ ఆయన నాచారం (Nacharam)లోని సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ (Sewarage Treatment Plant)ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) మరో నాలుగేళ్లు సుస్థిరంగా ఉండాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. ప్రజస్వామ్య వ్యవస్థలో తమకు కూడా ప్రజలకు పదేళ్ల పాటు అధికారాన్ని ఇచ్చారని గుర్తు చేశారు.

చీకటిని చూస్తేనే.. వెలుగు విలువ తెలుస్తుందని, గాడిదను చూస్తేనే గుర్రం విలువ తెలుస్తుందంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వం (Congress Government)పై ఆయన సెటైర్లు చేశారు. కాంగ్రెస్ పాలనను ఈ నాలుగేళ్లు ప్రజలు చూస్తే.. మరో 20 ఏళ్ల పాటు వాళ్ల మొఖాలు కూడా చూడని పరిస్థితి వస్తుందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ పార్టీ వాళ్లే ఒకరినొకరు తన్నుకు చస్తున్నారని కేటీఆర్ కామెంట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed