- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Addanki Dayakar : కేటీఆర్.. నీ పొలిటికల్ డ్రామాలు ఆపు.. వారిపై కేసులు పెట్టలేదు: అద్దంకి దయాకర్
దిశ, డైనమిక్ బ్యూరో: (KTR) కేటీఆర్.. నీ పొలిటికల్ డ్రామాలు ఆపు అంటూ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ (Addanki Dayakar) విమర్శించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం (X) ఎక్స్ వేదికగా ఒక వీడియో విడుదల చేశారు. ఎందుకంటే దాడులు చేయించింది మీరే అని అందరికీ తెలిసిన తర్వాత పరువు పోకుండా ఉండడానికే రైతుల పేరు మీద పరామర్శలు చేస్తున్నారని ఆరోపించారు. చెప్పినట్లుగానే రైతుల మీద ప్రభుత్వం ఏ కేసులు పెట్టలేదని వెల్లడించారు. ఎవరైతే మీ రౌడీ మూకలు, దాడులకు ఉసిగొల్పిన వారి మీదే కేసులు పెట్టడం జరిగిందని స్పష్టం చేశారు.
నేడు మీరు ఏ రాజకీయం తేవాలని అనుకుంటున్నారో వాటికి ప్రజలకు చరమగీతం పాడుతారని అన్నారు. ఇంకా అధికారం కోసం పాకులాడటం, మరింత దిగజారడం మంచి పద్ధతి కాదన్నారు. అధికారుల మీద దాడులు చేయడం జాతీయ స్థాయిలో పెద్ద చర్చ జరుగుతోందన్నారు. అధికారుల మీద దాడులు చేయించిన మీ వల్ల తెలంగాణ సమాజం తలదించుకునే పరిస్థితి వచ్చిందని కేటీఆర్‌పై అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు చేశారు.