KTR and Gautami : నటి గౌతమికి షాకిచ్చిన కేటీఆర్! సోషల్ మీడియాలో వీడియో వైరల్

by Ramesh N |   ( Updated:2024-10-26 14:32:33.0  )
KTR and Gautami : నటి గౌతమికి షాకిచ్చిన కేటీఆర్! సోషల్ మీడియాలో వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల క్యాన్సర్ బారి నుంచి బయటపడ్డ సీనియర్ నటి గౌతమి Gautami పక్కన కూర్చోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నిరాకరించారు. దీనికి సంబంధించిన Viral Video వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. TheSouthernRisingSummit2024 ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌ హైదరాబాద్‌లో తాజాగా వేదికగా జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో KTR కేటీఆర్‌తో సహా వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. సమ్మిట్ జరుగుతున్న టైమ్‌‌లో కేటీఆర్ వచ్చి నటుడు Prakash Raj ప్రకాష్‌రాజ్, గౌతమిని కలుసుకున్నారు. ప్రకాష్‌రాజ్‌ను కేటీఆర్ ఆప్యాయంగా పలకరించారు. పక్కనే ఉన్న నటి గౌతమికి హాయ్ చెప్పి.. హ్యాండ్‌‌‌షేక్‌ ఇచ్చి కూర్చున్నారు. ఆ సమయంలో గౌతమి పక్కన కూర్చోవడానికి కేటీఆర్ నిరాకరిస్తూ.. నటుడు ప్రకాష్ రాజ్ పక్కన కూర్చోవడం ఆసక్తిగా మారింది.

‘ఇప్పుడే పబ్లిక్ మీటింగ్ నుంచి వచ్చా.. పక్కనే కూర్చుంటే తనికి ఇన్ఫెక్షన్ వస్తుందంటూ’ కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో కేటీఆర్‌పై నెటిజన్లు ప్రశంసలు, విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక మంచి లీడర్ లక్షణం అని కేటీఆర్‌ను కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కేటీఆర్‌కు అంత అహంకారం ఎందుకని మరికొంత మంది విమర్శిస్తున్నారు. అదేవిధంగా రామన్న మైక్రోబయాలజిస్ట్.. అనుకుంటా అని ఓ నెటిజన్ ఫన్నీ కామెంట్ పెట్టారు. కాగా, ఇదే ఈవెంట్‌లో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు Ram Mohan Naidu, కేటీఆర్ ఆప్యాయంగా కలుసుకోని మాట్లాడుకోవడం వైరల్‌గా మారింది. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు గులాబీ నేత విషెస్ చెప్పారు. అనుకోకుండా కలుసుకున్నాము.. చాలా రోజుల తర్వాత మాట్లాడుకున్నామని శనివారం కేటీఆర్ తన x ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు.

Advertisement

Next Story