తెలంగాణలో మరో భారీ కుంభకోణం.. రూ.1100 కోట్ల అవినీతి అంటూ కేటీఆర్ సంచలనం

by Satheesh |   ( Updated:2024-07-30 17:10:11.0  )
తెలంగాణలో మరో భారీ కుంభకోణం.. రూ.1100 కోట్ల అవినీతి అంటూ కేటీఆర్ సంచలనం
X

దిశ, వెబ్‌డెస్క్: పౌరసరఫరాల శాఖలో రూ.1100 కోట్ల అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం సివిల్ సప్లై శాఖపై అసెంబ్లీలో సాధారణ చర్చ జరిగింది. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తుటాలు పేలాయి. కేటీఆర్ మాట్లాడుతూ.. సివిల్ సప్లై శాఖలో భారీ స్కామ్ జరిగిందని ఆరోపించారు. ఈ కుంభకోణంపై హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలకు వెంటనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సివిల్ సప్లైస్‌లో ఎలాంటి స్కామ్ జరగలేదని క్లారిటీ ఇచ్చారు.

సివిల్ సప్లై శాఖపై చర్చ బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య హాట్ హాట్ సాగింది. ఈ క్రమంలోనే సభలో ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సభలో ఇలా చేయడం తగదని.. మీరు అధికారంలో ఉన్నప్పుడు మేం వెల్‌లోకి దూసుకొచ్చామా అని నిలదీశారు. మీ స్లోగన్లకు భయపడమని.. మర్యాదగా ఉండేవారే సభలో ఉండడని హెచ్చరించారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుండి వాకౌట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed